Sunday, December 22, 2024

పారిస్ చేరుకున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

పారిస్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగాగురువారం పారిస్ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. తాను ఫ్రాన్స్ చేరుకున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని స్వాగత కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు. ఈ పర్యటనలో భాగంగా భారత్‌ఫ్రాన్స్ పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించేలా కృషి చేస్తానని తెలిపారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ఈ పర్యటన ఎంతో ప్రత్యేకమైందని ఆయన పేర్కొన్నారు. పారిస్‌లోని హోటల్‌కు చేరుకున్న తర్వాత ప్రధాని ప్రవాస భారతీయులు, వారి పిల్లలతో కొద్ది సేపు ముచ్చటించారు.

మోడీ రాకకోసం హోటల్ బయట ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయులు ఆయన రాగానే ‘ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. తన రెండు రోజుల పర్యటనలో మోడీ తొలుత ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్‌తో సమావేశమవుతారు. అనంతరం సెనేట్‌ను సందర్శించి సెనేట్ అధ్యక్షుడు గెరాడ్ లార్చర్‌తో భేటీ అవుతారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎలీసీప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం జరిగే ఆ దేశ ‘నేషనల్ డే’ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో మన త్రివిధ దళాలకు చెందిన 269 మంది సభ్యుల బృందం కూడా పాలు పంచుకోనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News