Wednesday, January 22, 2025

సరఫరాల వ్యవస్థ సంక్షోభంతో ముప్పే

- Advertisement -
- Advertisement -

జి 7లో ప్రధాని మోడీ ఆందోళన

హిరోషిమా : కొన్ని దేశాలు శక్తుల విస్తరణ ధోరణితో మానవాళికి అత్యవసరం అయిన ఆహార, ఇతరత్రా కీలక సరఫరా వ్యవస్థకు ప్రమాదం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జపాన్‌లో జి 7 సదస్సులో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. అణగారిన వర్గాలను కేంద్రీకృతంగా చేసుకుని సమ్మిశ్రిత ఆహార వ్యవస్థ అవసరం ఉందని తెలిపారు. సాంకేతికత అత్యవసరం దీని విషయంలో ప్రజాస్వామికత కీలకం అని తెలిపిన ప్రధాని సాంకేతికత ప్రగతికి ప్రజాస్వామ్యానికి మధ్య సముచిత వారధిగా ఉండటం వల్లనే మానవాళికి మంచి జరుగుతుందన్నారు.

ఆహార వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోంది. ప్రత్యేకించి సన్నకారు రైతుల ప్రయోజనాలు కీలకం , కానీ ఎరువుల మార్కెట్లను కంట్రోలు చేసే దేశాలు, శక్తులు ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు విధాలుగా ఆహార భద్రత సంబంధిత సరఫరా వ్యవస్థలో లోపాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏ దేశం పేరు ప్రస్తావించలేదు. ఆహార వృధాను నివారించాల్సి ఉంది. ఇది మనందరి సమిష్టి బాధ్యత అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News