Saturday, November 23, 2024

దేశమంతటా వ్యాక్సిన్ దిగ్విజయభేరి

- Advertisement -
- Advertisement -

“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌” ప్రధాని నోట గురజాడ మాట

దేశం మొత్తం మీద 1,91,181 మందికి టీకాలు

12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్, 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్ కొవాగ్జిన్‌తో కొత్త వైరస్ ఆటకట్టు : ఐసిఎంఆర్ చీఫ్ బలరాం బార్గవ సైనిక
ఆసుపత్రుల్లో 3వేల మందికి టీకా

భావోద్వేగానికి లోనైన మోడీ

‘కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఎంతో మంది తలుల్ల కడుపు కోతకు కారణమైంది’ అని ఆంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘దేశంనుంచి కరోనాను తరిమి కొట్టేందుకు లక్షలాది మంది వైద్యులు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది నిర్విరామంగా కృషి చేశారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విధులకోసమని వెళ్లిన సిబ్బందిలో కొంత మంది ఇళ్లకు తిరిగి రాలేదు’… లాక్‌డౌన్ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం అంత సాధ్యమైన విషయం కాదు. అయినా ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ప్రజల సహకారం వల్లే కరోనా వ్యాప్తిని అరికట్టగలిగాం. మహమ్మారికి ఎదుర్కోవడంలో ప్రజలంతా కలిసికట్టుగా ఉన్నారు’

న్యూఢిల్లీ: దేశంలో శనివారం చేపట్టిన కొవిడ్ టీకా కార్యక్రమం తొలి రోజున విజయవంతం అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తం గా 3351 సెషన్‌సైట్స్ (కేంద్రాలు) వద్ద 1.91,181 మంది టీకా పొందారని ఆరోగ్య మంత్రిత్వశాఖల అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని విలేకరులకు తెలిపారు. వ్యాక్సినేషన్ తరువాత అవలక్షణాలు తలెత్తినట్లు కానీ, ఎవరైనా ఆసుపత్రి పాలయినట్లు కానీ దాఖలాలు లేవని, ఈ క్రమంలో తొలిరోజున వ్యాక్సినేషన్ విజయవంతం అయినట్లుగా నిర్థారించుకున్నామని తెలిపారు.తొలిరోజు 12 రాష్ట్రాలలో కొవాగ్జిన్, మరో 11 రాష్ట్రాలలో కొవిషీల్డ్ టీకా వేశారని తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సామూహిక వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రపంచ దేశాలన్ని దీనిపై ఆసక్తితో దృష్టి సారించాయి. తమకు ఇప్పటి వ్యాక్సినేషన్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రాధమిక సమాచారం అందిందని మనోహర్ తెలిపారు. మొత్తం 3351 చోట్ల టీకా సెషన్స్ చేపట్టారు. ఇక టీకా లబ్ధిదారుల సంఖ్య మొత్తం వివరాలను అదనపు కార్యదర్శి తెలిపారు. తొలిరోజు టీకాలు వేసే కార్యక్రమంలో 16,755 మంది పాల్గొన్నారు. తొలిరోజున 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా డోస్‌లను వేశారు. ఇక రాష్ట్రాల వారిగా జరిగిన సెషన్స్ ప్రకారం చూస్తే తెలంగాణలో 11, అసోంలో 65, బీహార్‌లో 301, ఢిల్లీలో 8, హర్యానాలో 77, కర్నాటకలో 242,మహారాష్ట్రలో 285, ఒడిషాలో 161, రాజస్థాన్‌లో 167, తమిళనాడులో 160, ఉత్తరప్రదేశ్‌లో 317 జరిగాయి. ఇప్పుడు జరిగిన వ్యాక్సినేషన్‌లో అండమాన్ నికోబార్ దీవులకు చెందిన వారు 78 మంది, లడఖ్‌కు చెందిన వారు 76 మంది, డామన్ డియ్యూకు చెందిన వారు 43 మంది, దాద్రా నాగర్ హవేలీకి చెందిన వారు 64 మంది, లక్షద్వీప్ వారు 21 మంది, చండీగఢ్‌కు చెందిన వారు 195 మంది, గోవా వారు 373 మంది ఉన్నారని గణాంకాలతో వెల్లడైంది.

తొలిరోజున తెలంగాణలో 3600 మందికి, ఆంధ్రప్రదేశ్లో 16,963 మందికి, బీహార్‌లో 16,401 మందికి, మహారాష్ట్రలో 15,727 మందికి, అసోంలో 2721 మందికి, ఢిల్లీలో 3403 మందికి, హర్యానాలో 4656 మందికి, హిమాచల్ ప్రదేశ్‌లో 1408 మందికి, జమ్మూ కశ్మీర్‌లో1954 మందికి, చత్తీస్‌గడ్‌లో 4985 మందికి, అరుణాచల్ ప్రదేశ్‌లో 743 మందికి, యుపిలో 15,975 మందికి, పశ్చిమ బెంగాల్‌లో 9678 మందికి, ఉత్తరాఖండ్‌లో 2226 మందికి, రాజస్థాన్‌లో 9279 మందికి, పంజాబ్‌లో టీకాలు తొలివిడతగా పడ్డాయి. ఇప్పటి తొలిరోజు వ్యాక్సినేషన్‌లోభాగంగా తొలిటీకాను పారిశుద్ధ కార్మికుడు మనీష్‌కుమార్ పొందారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కుమార్‌కు టీకా వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియపింది. కొవిడ్ యాప్ కొ విన్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా వ్యాక్సిన్ వేసే పని చేపట్టారని వివరించారు. తొలిరోజు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ అన్ని రాష్ట్రాల సిఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో వెంటనే సమీక్షించారు. ఎటువంటి అపశృతి లేదని తెలిసిందని, కరోనా వైరస్‌కు ఇప్పుడు సంజీవని దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.
సైనిక ఆసుపత్రులలో 3వేల మందికి
టీకా పంపిణీపై భారత సైన్యం ఓ ప్రకటన వెలువరించింది. సైనిక ఆసుపత్రులలో పనిచేసే 3వేల మంది సిబ్బందికి తొలిరోజు తొలి డోస్ వేశారని వివరించారు.

PM Modi get emotional on Vaccine Dry day 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News