- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)లో రెండో డోసు కొవిడ్-19 టీకా తీసుకున్నారు. కరోనా వైరస్‌ను ఓడించడానికి అర్హులైన వారందరూ త్వరగా టీకా వేయించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. మార్చి 1వ తేదీన ఎయిమ్స్‌లో ప్రధాని మోడీ మొదటి డోసు టీకా వేయించుకున్నారు. తాను రెండో డోసు టీకా వేయించుకున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాను మోడీ వేయించుకున్నారు. పుదుచ్చేరికి చెందిన పి నివేద, పంజాబ్‌కు చెందిన నిషా శర్మ అనే ఇద్దరు నర్సులు ప్రధానికి వ్యాక్సిన్ వేశారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానికి మార్చి 1న మొదటి డోసు వ్యాక్సినేషన్ కూడా నివేద చేశారు.
PM Modi gets 2nd dose of COVID-19 vaccine at AIIMS
- Advertisement -