Wednesday, April 16, 2025

సామాన్యుడికి పాదరక్షలు తొడిగిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

మోడీ ప్రధాని అయ్యేవరకు , అలాగే స్వయంగా మోడీని కలుసుకునేంతవరకు పాదరక్షలు తొడగనని 2009లో ప్రతిజ్ఞ చేసిన హర్యానా లోని కైతాల్ నివాసి అయిన రామ్‌పాల్ కశ్యప్‌కు ప్రధాని మోడీ పాదరక్షలు తొడిగించారు. సోమవారం నాడు ప్రధాని మోడీ హర్యానా పర్యటన సమయంలో ఈ సంఘటన జరిగింది. తన కోసం 14 ఏళ్లుగా పాదరక్షలు లేకుండా నడుస్తున్న వీరాభిమాని కశ్యప్ శపథాన్ని మోడీ నెరవేర్చారు. దీనికి కశ్యప్ భావోద్వేగంతో చలించిపోయారు. “ కశ్యప్ ప్రతిజ్ఞ నాకోసం మాత్రమే కాదు. మన దేశానికి సరికొత్త దిశా నిర్దేశం కోసం కోరుకున్న ప్రజలందరి సమష్టి శక్తికి నిదర్శనం. 14 ఏళ్ల పాటు పాదరక్షలు లేకుండా నడవడం అంటే అంత సులభం కాదు. ఇది త్యాగానికి , చెక్కు చెదరని విశ్వాసానికి పరాకాష్ట ” అని సభికుల హర్షధ్వానాల మధ్య మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News