Sunday, January 19, 2025

గాయాల జమ్మూకశ్మీర్‌కు ఘనమైన భవితఘనత

- Advertisement -
- Advertisement -

PM Modi gives development mantra in Palli village

ఆర్టికల్ 370 రద్దుతో జాతీయ స్రవంతిలోకి
కేంద్ర సహాయ పథకాలు నేరుగా జనంలోకి
జమ్మూ పల్లీ నుంచి పంచాయతీ సందేశం
గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య పర్యటన

పల్లీ : జమ్మూ కశ్మీర్ ఘనత విశిష్టమైనదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రజాస్వామ్యం, ధృఢచిత్తం సంకల్పబలానికి ఈ ప్రాంతం చిరునామాగా మారిందని ప్రశంసించారు. గతం జ్ఞాపకాలను పక్కకు పెట్టి లోయ జమ్మూ ప్రాంతాలు అభివృద్థి పథంలో ముందుకు సాగుతున్నాయని ,గత రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆదివారం జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందేశానికి వేదిక అయింది. ఇక్కడ ప్రధాని చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీలే అధికార వికేంద్రీకరణకు అంతకు మించి గ్రామీణ ప్రాంతాల వికాసం పటిష్టతకు కీలకం అని, ఈ దిశలో వీటి ప్రాధాన్యత ఎంతో ఉందని తెలిపిన ప్రధాని తమ ప్రసంగంలో జమ్మూ కశ్మీర్‌లో గతరెండేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొంటూ ఆర్టికల్ 370 రద్దు తరువాతి పరిణామాలలోనే ఈ ప్రగతి ఫలాలు ప్రజలకు అందాయని నేరుగానే ప్రధాని తెలిపారు.

ఆర్టికల్ 370 చట్రంలో జాతీయ స్థాయిలోని వివిధ సంక్షేమ పథకాలైతేనేమి, కేంద్రం సహాయం అయితేనేమి, 175 వరకూ కేంద్రచట్టాలు ఈ ప్రాంతానికి విస్తరించలేని స్థితి ఉండేదని ఇప్పుడు ఆర్టికల్ ఎత్తివేతతో కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ఇక్కడి ప్రజలకు చేరడం ద్వారా వారు జనజీవన స్రవంతిలో చేరేందుకు ఉగ్రవాదం తుదముట్టించేందుకు మార్గం ఏర్పడిందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలోని పలు అంశాలు మౌలిక స్థాయిలో ఇక్కడి గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు ప్రస్ఫుటం కావడంతో గ్రామాల ప్రాతిపదికన వికాసం సాధ్యం అయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇంతకాలం ఎంతో కోల్పోతూ వస్తున్న అట్టడుగు స్థాయి ప్రజలకు ఇప్పుడు అన్ని విధాలుగా చేయూత అందుతోంది. ఈ విధంగా ఇప్పుడు జమ్మూ లేదా శ్రీనగర్ ఢిల్లీకి మరింత చేరువ అయ్యాయని, అబ్ ఢిల్లీ దూర్ నహీ పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు ఇక్కడ కొద్దికాలం క్రితం శాంతియుతంగా జరిగాయని ఇది ఈ ప్రాంత చరిత్రలోఅత్యంత కీలక ఘట్టం అయిందని వివరించారు.

దేశానికి పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రగతికి పట్టుగొమ్మ. గ్రామీణ స్థాయిలో ప్రగతికి ఖచ్చితమైన దారులు పడేందుకు వీలైన పలు అంశాలు ఈ వ్యవస్థలో పొందుపర్చుకుని ఉన్నాయని ఇటువంటి వ్యవస్థ ద్వారా ప్రయోజనాలు ఇక్కడి ప్రజలకు అందితే ఇక అంతకు మించి కావల్సినదేముంటుందని ప్రధాని ప్రశ్నించారు. ఆర్టికల 370 రద్దు తరువాత ప్రధాని మోడీ జమ్మూ మారుమూల ప్రాంతాలలో జరిగిన సభకు రావడం , ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం కీలకపరిణామం అయింది. రెండు రోజుల క్రితమే ప్రధాని సభ స్థలికి కొద్ది మైళ్ల దూరంలోనే పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే భద్రతా బలగాలను లక్షంగా చేసుకుని దాడికి దిగింది. ఈ దశలో ఎన్‌కౌంటర్ సంచలనానికి దారితీసింది. ప్రధాని సభ విచ్ఛిన్నానికే ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సూసైడ్ బాంబర్లతో దాడికి దిగినట్లు పసికట్టారు. ఉగ్రవాద శక్తుల ఉనికి నేపథ్యంలో ఇక్కడ ప్రధాని పర్యటన నేపథ్యంలో రెండుమూడు రోజుల ముందు నుంచే భారీ బందోబస్తు ఏర్పాటుఅయింది. జాతీయ రహదార్లపై వాహనాల రాకపోకలను నియంత్రించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అత్యుత్తమమైనదని, దీని పట్ల ప్రజలుగర్విస్తూ ఉండటంలో తప్పేమీ లేదని ప్రధాని తెలిపారు. అయితే ఈ ప్రాంతం వారికి ఏళ్ల తరబడిగా ఈ చట్టాలు వ్యవస్థల ఫలం అందని ద్రాక్షపండే అయిందని, దీనిని కేంద్రం చక్కదిద్దిందని ప్రధాని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News