Monday, December 23, 2024

ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేందుకు ఓటు వేయాలి: ప్రధాని

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేందుకు అందరూ ఓటు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఓటర్ల దినోత్సవం భారత శక్తివంతమైన ప్రజాస్వామ్య పండుగ అని కొనియాడారు.  2047నాటికి అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించే బాధ్యత అందరిపై ఉందన్నారు. అభివృద్ధి చెందిన భారత దేశంలో మీ పేర్లను సువర్ణాక్షరాలతో చెక్కవచ్చునని మోడీ చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు సరైన దిశలో వెళ్లటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఓటు అనేది అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఓటరుగా పేర్లు నమోదు చేసుకొని శక్తివంతమైన వ్యక్తిగా మారాలని, 25 ఏళ్ల తరువాత దేశ భవిష్యత్‌ను మార్చే శక్తి దేశ ప్రజలకే ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News