- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముని ఆశీస్సులు దేశాన్ని అన్ని ప్రయత్నాలలో మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఎక్స్ వేదికగా.. “అందరికీ రామనవమి శుభాకాంక్షలు. ప్రభు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. మన అన్ని ప్రయత్నాలలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి” అని మోడీ పోస్ట్ చేశారు. ఈ రోజు ప్రధాని.. రామేశ్వరాన్ని సందర్శించనున్నారు.అక్కడి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి.. పూజలు నిర్వహించనున్నారు.
- Advertisement -