Wednesday, January 22, 2025

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ పురోభివృద్ధికి రాష్ట్రం తోడ్పాటు పట్ల ప్రతి భారతీయుడు ఎంతగానో గర్వపడుతున్నాడు అని మోడీ పేర్కొన్నారు. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నా తెలంగాణ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. దేశ ప్రగతికి రాష్ట్రం తోడ్పాటుకు ప్రతి భారతీయుడు ఎంతో గర్విస్తున్నాడు’ అని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రం సుసంపన్న చరిత్ర, సంస్కృతితో అలరారుతున్నదని మోడీ అన్నారు. మున్ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని ప్రకటిస్తున్నట్లు మోడీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News