Thursday, January 9, 2025

రాజకీయ సుస్థిరత వల్లే సంస్కరణలు సుసాధ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో గత తొమ్మిదేళ్లుగా నెలకొన్న రాజకీయ సుస్థిరత్వంతోనే వివిధ రంగాల్లో పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2014కు ముందు మూడు దశాబ్దాల కాలంలో ప్రభుత్వాలు అస్థిరంగా ఉండేవని, ఆ కారణంగానే అవి పెద్దగా అభివృద్ధి సాధించలేకపోయాయన్నారు. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి సాధించాలంటే సుస్థిరత, స్పష్టమైన ప్రజల తీర్పు ముఖ్యమని ఆయన అన్నారు. మరి కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కలిసి పోటీ చేయాలని తీర్మానించడం ద్వారా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బిజెపికి దీటుగా సవాలు విసరడానికి 28 పార్టీల ప్రతిపక్ష కూటమి సిద్ధమవుతూ ఉండడమే కాకుండా వీలయినంత మేరకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని అనుకొంటున్న తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది, ఢిల్లీలో వచ్చే వారం చివర్లో జి20 శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆదివారం పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరనున్న సమయంలో ప్రధాని మరో సారి ఉచిత తాయిలాలపై చర్చను లేవనెత్తారు. ‘ ఆర్థికంగా బాధ్యతా రహితమైన విధానాలు, ప్రజాకర్షక పథకాలు తాత్కలికంగా రాజకీయ లబ్ధి చేకూర్చవచ్చునేమో కానీ దీర్ఘకాలంలో సామాజిక, ఆర్థిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. తాను అనేక సందర్భాల్లో రాష్ట్రాలను ఈ విషయంలో హెచ్చరించడం జరిగిందని కూడా ప్రధాని అన్నారు. దేశంలో అవినీతి, కులమతతత్వాలకు చోటుండదని ఆయన స్పష్టం చేశారు. జిడిపి దృక్కోణంనుంచి మానవీయ దృక్కోణంలో చూసే దిశగా మారుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఇందుకు భారత్ ఉత్ప్రేరకంగా పని చేస్తోందన్నారు. ప్రపంచ సంక్షేమానికి ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ మార్గదర్శకంగా మారుతుందన్నారు. భారత్ జి20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం ఒకప్పుడు మూడో ప్రపంచ దేశాలుగా పిలవబడే పేదదేశాల్లో విశ్వాస బీజాలను నాటిందని ఆయన అంటూ..

ఈ మారుతున్న వాస్తవాలను అంతర్జాతీయ సంస్థలు గుర్తించడంతో పాటుగా తమ నిర్ణయాత్మక వేదికలను విస్తరించాలని, తమ ప్రాధాన్యతలను పునస్సమీక్షించుకొని వాటికి ప్రాతినిధ్యం వహించే గొంతుకలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ‘ భారత్ అధ్యక్షత వహించడంతో జి20 చాలాసానుకూల ప్రభావం పడింది. వీటిలో కొన్ని నా మనస్సుకు దగ్గరైనవి ఉన్నాయి. ఈ సదస్సులో భారత్ మాటలు, దార్శనికతను ప్రపంచం భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌గా భావిస్తోంది. భారత నాయకత్వం పేద దేశాల్లో ఆత్మ విశ్వాసం నింపింది.‘ వసుధైవ కుటుంబం’ అనేది కేవలంఒక స్లోగన్ కాదు. అది మన సాంస్కృతిక విలువనుంచి నడిపించిన సమగ్ర తత్వం. ఏడాది పాటు జరిగే జి20 కార్యక్రమాల్లో దాదాపు 15 కోట్ల మంది భారతీయులు భాగస్వాములయ్యారు.మన జి20లో ఆఫ్రికాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం’ అని అన్నారు. కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో జి20 కార్యక్రమాలను నిర్వహించడంపై చైనా, పాక్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఆయన కొట్టిపారేశారు. దేశంలోని ప్రతి భాగంలో జి20కార్యక్రమాలు నిర్వహించడం

సర్వ సాధారణమన్నారు.2014, 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు సుస్థిరమైన ప్రభుత్వం, స్పష్టమైన విధానాలు, మొత్తం దిశపై స్పష్టత ఉండేందుకు కారణమైనాయన్నారు .2014కు ముందు మూడు దశాబ్దాల కాలంలో దేశం అనేకఅస్థిర ప్రభుత్వాలను చూసింది.అందువల్ల ఎక్కువ లబ్ధి పొందలేకపోయింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దానివల్ల సుస్థిర ప్రభుత్వం ఏర్పడడమే కాకుండా స్పష్టమైన విధానాలు, మొత్తం దిశ విషయంలో స్పష్టత వచ్చాయి’ అని అన్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో పలు సంస్కరణలు తీసుకు రావడానికి కారణం ఈ సుస్థిరతే.ఆర్థిక, విద్య,ఫైనాన్షియల్ రంగాల్లో బ్యాంకులు, డిజిటలైజేషన్, సంక్షేమం, సామాజిక రంగాల్లో తీసుకువచ్చిన ఈ సంస్కరణలు ఒక బలమైన పునాదిని వేశాయి. అభివృద్ధి అనేది దీనికి లభించిన బోనస్ మాత్రమే.

భారత్ శరవేగంగా, నిలకడగా సాధించిన అభివృది ్ధప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింఇ. చాలా దేశాలు మన అభివృద్ధిని నిశితంగా గమనిస్తూ ఉన్నాయి. ఈ అభివృద్ధి ప్రమాదవశాత్తు సంభవించింది కాదని, రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’లతో కూడినస్పష్టమైన, కార్యాచరణతో కూడిన రోడ్‌మ్యాప్ ఫలితమేనని వాళ్లు అర్థం చేసుకున్నారని ప్రధాని అన్నారు. ‘ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. ఒకప్పుడు భారత్‌ను 100 కోట్ల ఆకలి కడుపులుగా చూసే వారుకానీ ఇప్పుడు ఆకాంక్షలతో నిండిన 100 కోట్ల మొదళ్లుగా..నైపుణ్యంతో కూడిన 200 చేతులుగా చూస్తున్నారు. వచ్చే వెయ్యేళ్లకు గుర్తుండిపోయే విధంగా అభివృద్ధికి పునాది వేయడానికి ఇప్పుడు భారతీయులకు మంచి అవకాశం లభించింది. భారత్ గత పదేళ్లలో జిడిపి విలువల్లో ఐదు స్థానాలు ఎగబాకింది’ అని వెల్లడించారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై..
రష్యాఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోడీ స్పందిస్తూ చర్చలు, సంప్రదింపులతో మాత్రమే వేర్వేరు ప్రాంతాల్లో తలెత్తిన వేర్వేరు సంక్షోభాలను పరిష్కరించుకోగలమన్నారు. ఇక ఉగ్రవాదం, సైబర్ ముప్పుపై మోడీ స్పందిస్తూ‘ సైబర్ ముప్పులను తీవ్రంగా పరిగణించాలి. సైబర్ ఉగ్రవాదం, ఆన్‌లైన్ రాడికలైజేషన్, మనీ లాండరింగ్‌లు కేవలంఓ చిన్న భాగం మాత్రమే. ఉగ్రవాదులు దేశాల సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే దారుణ లక్ష సాధన కోసం డార్క్‌నెట్, మెవెర్స్, క్రిప్టో కరెన్సీలను వాడుకుంటున్నారు. వార్తలపై విశ్వాసాన్ని ఫేక్‌న్యూస్, డీప్ ఫేక్‌లు దెబ్బతీస్తాయి. ఇది సామాజిక అస్థిరతకు కారణమవుతుంది.సైబర్ క్రైమ్‌పై పోరాటానికి ప్రపంచ సహకారం అవసరం’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News