Monday, January 20, 2025

మోడీ గ్యారంటీలకు…వ్యారంటీ గాయబ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కాచిగూడ/అంబర్‌పేట: మోడీ గ్యారంటీలకు వ్యారెంటీ లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే అణా పై సా పేదలకు ఇప్పించలేని కిషన్‌రెడ్డి మళ్లీ ఎం పిగా గెలిపిచినా ఓరిగగేదేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం.. రాహూల్ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సి కింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా సోమవారం రా త్రి నల్లకుంట ఫీవర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసి న కార్నర్ మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తు న పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. రోడ్ షో నేపథ్యంలో తిలక్‌నగర్ చౌరస్తా నుంచి నల్లకుంట నలువైపులా ఏర్పాటు చేసిన కటౌట్లతో ఈ ప్రాంతమంతా జెండాలతో రెపరెపలాడింది. మొదట సీఎం రేవంత్ రెడ్డికి నాయకులు, కా ర్యకర్తలు ఈలలు, కేరింతలు గజమాలతో తిలక్‌నగర్ చౌరస్తా వద్ద పూలవర్షంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తిలక్‌నగర్ చౌరస్తా నుంచి నల్లకుంట ఫీవర్ చౌరస్తా వరకు రోడ్ షో సాగింది. నల్లకుంట ఫీవర్ చౌరస్తాలో ఏ ర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. అంబర్‌పేట ని యోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒ కసారి ఎంపిగా గెలిచి, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తెచ్చింది కేవలం గాడిద గుడ్డేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే నగరం విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే దసరా పండుగ నాటికి బతుకమ్మ కుంట లో బతుకమ్మవేడుకలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దానం నాగేందర్‌ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే సోనియాగాంధీ, రాహూల్ గాంధీ, మ ల్లికార్జున ఖార్గేలతో ఒప్పించి కేంద్రమంత్రిని చే సే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశా రు. దానం నాగేందర్ కేంద్రమంత్రి అయితేనే నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. బిఆర్‌ఎస్ సచ్చిన పాము అని..ఆ పార్టీ గురించి ప్రస్తావించడం అనవసరమన్నారు. కాంగ్రెస్ ఏమీ చేయలేదని కెటిఆర్ ఆంటున్నాడు, కెటిఆర్..నువ్ చీర కట్టుకుని బస్సు ఎక్కు.. నిన్ను టికెట్ అడిగితే కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయనట్లు.. అడగకపోతే
గ్యారంటీలు అమలు కానట్లు అని అన్నారు.

తండ్రీ కొడుకులు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు, మోసాల కాలం చెల్లింది..ఇక మిమ్మల్ని నమ్మేవారు ఎవరూ లేరని హెచ్చరించారు. తెలంగాణకు బిజెపి ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప..బిజెపికి కర్రు కాల్చి వాత పెట్టాలని పేర్కొన్నారు. ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు డా.రోహిన్‌రెడ్డి మాట్లాడుతూ..దానం నాగేందర్‌ను లక్ష మెజార్టీతో గెలిపించే బాధ్యత అంబర్‌పేట నియోజకవర్గ ప్రజలు తీసుకోవాలని కోరా రు. కేం ద్రమంత్రిగా కిషన్‌రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమం తరావు మా ట్లాడుతూ..నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి విడగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. జోడోయాత్రలో భాగంగా రాహూల్ గాంధీ దేశాని కలిపే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ..తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం ఎంపి అనిల్‌కు మార్‌యాదవ్ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జ్ఞానేశ్వర్‌గౌడ్, దిడ్డి రాంబాబు, గరిగంటి శ్రీదేవి, ఖైరతాబాద్ మహి ళా విభాగం అధ్యక్షు రాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌గౌడ్, లక్ష్మణ్‌యాదవ్, లకుపతి యాదగిరి గౌడ్, దేవిరెడ్డి విజితారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News