Monday, March 10, 2025

పులుల 58వ అభయారణ్యం ఏర్పాటుపై ప్రధాని మోడీ హర్షం

- Advertisement -
- Advertisement -

మధ్య ప్రదేశ్‌లోని మాధవ్ టైగర్ రిజర్వ్‌తో భారత్ పులుల అభయారణ్యాల సంఖ్యను 58కి పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఇది ‘వన్యప్రాణుల ప్రేమికులకు అద్భుత వార్త’ అని ఆయన అన్నారు. దేశం తన పులుల అభయారణ్యాల సంఖ్యను 58కి పెంచిందని ఉత్సుకతతోప్రకటిస్తున్నానని, తాజాగా మాధవ్ టైగర్ రిజర్వ్ ఆ జాబితాలో చేరిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం తెలిపారు. యాదవ్ పోస్ట్‌ను మోడీ ‘ఎక్స్’లో జత చేస్తూ, ‘వన్యప్రాణుల ప్రేమికులకు అద్భుత వార్త! మేము ఎల్లప్పుడూ జంతువుల పరిరక్షణలో ముందంజలో ఉంటాం’ అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News