Monday, January 20, 2025

దేశ సంపదను ప్రధాని మోడీ.. అదానీలకు దోచిపెడుతున్నారు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ

మనతెలంగాణ/హైదరాబాద్: దేశ సంపదను ప్రధాని మోడీ,  అదానీలకు దోచిపెడుతున్నారని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో రోడ్ షో నిర్వహించి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నియామకాలు లేక యువతకు ఉపాధి, ఉద్యోగాలు అవకాశాలు లేవని ఆమె ఆరోపించారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీల పార్టీ కాంగ్రెస్ అన్నారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ కర్ణాటకలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ద్రోహులను నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చంద్రశేఖర్‌ను గెలిపించాలని ఆమె కోరారు. తాము అధికారంలోకి వస్తే గృహిణులకు అండగా ఉంటామని , ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీల పార్టీఅని, ప్రజాసేవ కోసం పుట్టిన పార్టీని దేశ రక్షణ కోసం పట్టం కట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Priyanka Gandhi

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News