Monday, January 20, 2025

అగ్నిపథ్‌పై మోడీ వెనుకడుగు తప్పదు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

PM Modi have to back step on Agnipath: Rahul

న్యూఢిల్లీ: రైతుల నిరసనలకు లొంగి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు గానే యువజనుల డిమాండుకు తలొగ్గి ప్రధాని నరేంద్ర మోడీ అగ్నిపథ్ సైనిక నియామక పథకాన్ని ఉపసంహరించుకోక తప్పదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గడచిన ఎనిమిదేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జై జవాన్, జై కిసాన్ విలువలను అవమానిస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరించుకోక తప్పదని తాను గతంలో కూడా చెప్పానని శనివారం ట్వటర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. అదే తరహాలో.. దేశ యువత డిమాండుకు తలొగ్గడం ద్వారా మాఫీవీర్‌గా మారి అగ్నిపథ్ పథకాన్ని ప్రధాని వాపసు తీసుకోక తప్పదని రాహుల్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా అగ్నిపథ్ పథకంపై దేశ యువజనుల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలకు సంఘీభావం తెలిపారు. సైనిక నియామకాల కోసం సిద్ధమవుతున్న గ్రామీణ యువత వేదనను తాను అర్థం చేసుకోగలనని, గత మూడేళ్లుగా నియామకాలు లేవని, పరుగెత్తి పరుగెత్తి వారు విసిగి వేసారి పోయారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. వైమానిక దళంలో నియామక ఫలితాలు, నియామక పత్రాల కోసం యువత ఎదురుచూస్తోందని ఆమె పేర్కొన్నారు. దేశ యువజనుల శాశ్వత నియామకాలను, ర్యాంకు, పెన్షన్‌లను ప్రభుత్వం లాగేసుకోవడంతోపాటు నియామకాలను నిలిపివేసిందని ఆమె ఆరోపించారు.

PM Modi have to back step on Agnipath: Rahul

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News