న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ పరిణామాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించడానికి ప్రధాని నరేంద్రమోడీ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. అఫ్గాన్‌లో భారత్ తక్షణ ప్రాధాన్యతలపై దృష్టి సారించనున్నది. ప్రస్తుతానికి ఆ దేశంలో చిక్కుకు పోయిన భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురాడానికి భారత్ ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండు దశాబ్దాల్లో అఫ్గాన్‌లో భారత్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ దేశానికి పార్లమెంటు భవనాన్ని కూడా నిర్మించి ఇచ్చింది. ఈ కమిటీ గత కొన్ని రోజులుగా భారతీయులను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకురావడం, అలాగే అక్కడ నుంచి వస్తున్న అఫ్గాన్ జాతీయులపై భారత్ లక్షంగా అఫ్గాన్ నుంచి ఎలాంటి ఉగ్రవాదానికి తావు లేకుండా చూడడం వంటి పరిణామాలపై చర్చిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనపై భారత్ వేచి చూసే ధోరణిలో ఉంది. అక్కడి పరిణామాలపై భద్రతా మండలి ప్రకటనతోపాటు, అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో నిశితంగా పరిశీలిస్తోంది.
అఫ్గానిస్థాన్ పరిస్థితిపై అత్యున్నత స్థాయి కమిటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -