Sunday, September 8, 2024

బిజెపి ముఖ్యమంత్రులతో పిఎం మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. బిజెపి నిర్వహించే ముఖ్యమంత్రి పరిషద్‌లో రాష్ట్రాలలో అమలవుతున్న ముఖ్యమైన పథకాలు, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు రాష్ట్ర ప్రజలకు చేరేందుకు తీసుకుంటున్న చర్యలు, సుపరిపాలన కోసం పాటిస్తున్న పద్ధతులను చర్చిస్తారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జెపి నడ్డా(బిజెపి అధ్యక్షుడు కూడా), ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్(ఉత్తర్ ప్రదేశ్), హిమంతా బిశ్వ శర్మ(అస్సాం), భజన్‌లాల్ శర్మ(రాజస్థాన్), మోహన్ చరణ్ మాఝి(ఒడిశా తదితరులు రెండు రోజుల ఈ సమావేశం మొదటి రోజున హాజరయ్యారు.

మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, హర్యానా, మణిపూర్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పరిస్థితిని కూడా నాయకులు చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో బీహార్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇచ్చి తమ రాష్ట్రాలను విస్మరించారంటూ ప్రతిక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికలలో తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కూడా ఇదే కావడం విశేషం. చివరిసారి ఫిబ్రవరిలో ఈ సమావేశం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News