- Advertisement -
న్యూఢిల్లీ: సైక్లోన్ యాస్ తుఫాన్ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ మంత్రిత్వశాఖల అధికారులతో ప్రధాని సమీక్షించారు. యాస్ తుఫాన్ సన్నద్ధత, ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రధాని మోడీ చర్చించారు. ఈ భేటీలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నుండి సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు, టెలికాం కార్యదర్శులు, విద్యుత్, పౌర విమానయానం, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలతో పిఎం నరేంద్ర మోడీ సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడుపై తుఫాన్ ప్రభావం చూపిస్తుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
PM Modi holds review meeting on Cyclone Yaas
- Advertisement -