Monday, December 23, 2024

విజయోత్సాహంతో గుజరాత్‌లో మోడీ రోడ్‌షో

- Advertisement -
- Advertisement -

PM Modi holds roadshow in Gujarat

అహ్మదాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లో రెండోసారి అధికారంలోకి రావడంతోపాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బిజెపి తిరిగి నిలబెట్టుకోవడాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌లో బిజెపి ప్రధాన కార్యాలయం ఉన్న కమలం వరకు ఈ రోడ్ షో సాగింది. పూలమాలలతో అలంకరించిన ఓపెన్ టాప్ జీపులో ప్రయాణించిన మోడీ దారిపొడవునా ఇరువైపులా నిలుచుని హర్షధ్వానాలు చేసిన వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్న మోడీ పంచాయతీలకు చెందిన లక్ష మంది ప్రతినిధులతో జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News