Friday, December 20, 2024

గుజరాత్‌లో రెండోరోజూ మోడీ రోడ్ షో

- Advertisement -
- Advertisement -

PM Modi holds roadshow in Gujarat for second day

గాంధీనగర్: రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండవరోజు శనివారం కూడా గాంధీనగర్‌లో రోడ్ షో నిర్వహించారు. గాంధీనగర్ జిల్లాలోని దెహగామ్ పట్టణం నుంచి లవద్ గ్రామంలోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ మధ్య ఆయన రోడ్ షో సాగింది. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ప్రధాని అభివాదం చేశారు. రోడ్ షోకు ముందు కారులో రాజ్‌భవన్ నుంచి బయల్దేరిన మోడీ దెహగామ్‌కు చేరుకున్న తర్వాత ఓపెన్ టాప్ జీపులోకి మారారు. ఆయన వెంట జీపులో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా రోడ్ షోలో పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల దూరం సాగిన ఈ రోడ్ షోలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రధాని మోడీకి అభివాదం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగవలసి ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోడ్ షోలు ప్రచార ఆరంభంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News