Wednesday, January 22, 2025

విక్రమ్‌సింఘేతో మోడీ విస్తృత చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్, శ్రీలంక ఆర్థిక భాగస్వామ్యం మరింతగా విస్తరించుకుంటుంది. సంబంధిత దృక్పథ పత్రంపై ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. భారతదేశ పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షులు రణీల్ విక్రమ్‌సింఘే, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య విస్తృత స్థాయి చర్చల తరువాత శుక్రవారం అత్యంత కీలకమైన విజన్ డాక్యుమెంట్‌పై ఆమోద ముద్ర పడింది. గత ఏడాది శ్రీలంకలో పలు ఆర్థిక సమస్యలు తలెత్తాయయని, ఈ దశలో భారతదేశం శ్రీలంకతో భుజం భుజం కలిపి నడిచిందని, లంక ప్రజలను ఆదుకుందని ప్రధాని తెలిపారు. ఆ దేశ సంక్షోభ దశలో భారత్ నిజమైన సన్నిహిత స్నేహితపక్షంగా నిలిచిందని గుర్తుచేశారు.

ఇప్పుడు ఇరుదేశాల నడుమ కుదిరిన విజన్ డాక్యుమెంట్‌తో పరస్పర ఆర్థిక భాగస్వామ్యం ఇనుమడిస్తుంది. శ్రీలంకలో రూపాయిలలో లావాదేవీలకు వీలు కల్పించే యుపిఐ ప్రక్రియ ప్రారంభించే ఒప్పందం వల్ల ఇరుదేశాల మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుందని తెలిపారు. శ్రీలంక అధ్యక్షులు స్పందిస్తూ భారతదేశ సర్వతోముఖ ప్రగతి ఇరుగుపొరుగుదేశాలకే కాకుండా , హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఉపయుక్తంగా మారుతుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News