Wednesday, January 22, 2025

కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని.. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్‌లో శుక్రవారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద శ్రామిక-వర్గాల ప్రజల కోసం నిర్మించిన ఇళ్లను అందజేస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబాల కలలు సాకారం కావడం తనకు ఎనలేని సంతృప్తిని కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో రూ. 2,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి షోలాపూర్‌కు వెళ్లిన మోడీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై) కింద నిర్మించిన ఇళ్లను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, దేశంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ సొసైటీలో నిర్మించిన ఇళ్లను తాను చూశానని, అదే సమయంలో వేలాది కుటుంబాలు నివసించడానికి ఇల్లు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రసంగం మధ్యలో ”చిన్నతనంలో నాక్కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వచ్చి ఉంటే ఎలా ఉండేదో అని ఆలోచించా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. షోలాపూర్‌లోని వేలాది మంది పేదలు, కూలీల కోసం మేము చేసిన ప్రతిజ్ఞ ఈరోజు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీ నేడు ప్రారంభించబడింది. ఈరోజు చూసి వచ్చాను అనుకున్నాను… నా చిన్నతనంలో నాకు కూడా ఇలాంటి ఇంట్లో ఉండే అవకాశం వచ్చిందనుకుంటాను” అంటూ ప్రధాని కన్నీళ్లు ఆపుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News