Tuesday, December 24, 2024

ప్రధాని మోడీకి మరో పురస్కారం

- Advertisement -
- Advertisement -

భారత ప్రధాని నరేంద్రమోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రధాని మోడీకి కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్టు తెలియజేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మోడీ విశేష కృషి చేశారని కొనియాడింది. వచ్చేవారం గయానాలో జరిగే ఇండియా కరికోమ్ సదస్సులో ఆ అవార్డును ప్రదానం చేయనున్నట్టు వెల్లడించింది.

నవంబరు 19 నుంచి 21 మధ్య ఈ సదస్సు జరుగుతుంది. “ 2021 ఫిబ్రవరిన ప్రధాని మోడీ డొమినికా కు 70 వేల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపించారు. ఆ అపురూప కానుక వల్ల మేం మా పొరుగుదేశాలకు అండగా నిలవగలిగాం. అంతేకాదు, ప్రధాని మోడీ నేతృత్వంలో ఆరోగ్యం, విద్య, ఐటీ రంగంలో భారత్ మాకు మద్దతు అందిస్తోంది. భారత్ మాకు గొప్ప భాగస్వామి. అందుకే ఆ దేశ ప్రదానిని మా అత్యున్నత పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించాం” అని డొమినికా ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News