Sunday, December 22, 2024

ప్రధాని మోడీకి మరో రెండు అత్యున్నత పురస్కారాలు

- Advertisement -
- Advertisement -

భారత ప్రధాన మంత్రినరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. గయానా, డొమినికా దేశాలు ప్రధానిని తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ప్రస్తుతం గయానా పర్యటనలో ఉన్న మోడీ ఈ రెండు పురస్కారాలను అందుకున్నారు. ప్రపంచ దేశాలకు మోడీ అందిస్తున్న సహాయ సహకారాలకు గాను, గయానా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ను ప్రకటించింది. ఈ అవార్డును ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ గురువారం భారత ప్రధానికి అందించారు.

ఈ అత్యున్నత పురస్కారం స్వీకరించిన నాలుగో విదేశీ నేత మోడీనే కావడం విశేషం. అంతకు ముందు డొమినికా కూడా ప్రధానికి పురస్కారాన్ని అందజేసింది. కొవిడ్ తమ దేశానికి భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఆ దేశాధ్యక్షురాలు సిల్వానీ బర్టన్, ప్రధాని మోడీని గురువారం డొమినికా అవార్డ్ ఆఫ్‌ఆనర్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారాలను కోట్లాది మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News