Saturday, December 21, 2024

2న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi Hyderabad visit on 2 July

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు

హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా జూలై 1 హైదరాబాద్ కు రానున్నారు. ఇక ప్రధాని మోడీ కూడా ఈ సమావేశాలకు రావటమే కాదు రెండు రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. జులై 2న హైదరాబాద్ కు రానున్న మోడీ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లోనగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. పరేడ్ గ్రౌండ్ లో తలపెట్టిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పార్టీ విస్తృత ఏర్పాట్లు జరగుతున్నాయి.

జులై 2, 3 తేదీల్లో నగరంలో జరిగే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతలందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యం వహించనున్నారు. నడ్డా జులై 1నే హైదరాబాద్ చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమావేశాలకు వేదికగా నిలుస్తున్న నోవాటెల్ వరకు భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని తెలంగాణ బిజెపి నేతలు నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగుతుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండా, చేయాల్సిన తీర్మానాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు జులై 2 ఉదయం బీజేపీ పదాధికారుల సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి జులై 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయి. జులై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని తరలించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.

4న ఎపిలో మోడీ పర్యటన

జులై 4వ తేదీన ప్రధాని మోదీ భీమవరంలో పర్యటిస్తారు. అజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించునున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే ఈ వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇక ఏపీకి మోడీ రానున్న నేపథ్యంలో బిజెపి నేతలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News