Friday, December 20, 2024

కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా నక్సలైట్లు బలోపేతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా నక్సలైట్లు బలోపేతం అవుతున్నారని ప్రధాని నరేంద్రం మోడీ అన్నారు. ఓ వైపు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నక్సలిజం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఉగ్రవాదులు, నక్సలైట్లు బాగా బలోపేతం అయ్యారని ఆరోపించారు.

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ హింసను నియంత్రించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఉగ్రవాదులు, నక్సలైట్ల సమస్యలు ఉన్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో బాంబు పేలుళ్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు తావు లేకుండా చేశామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిష్రాంపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో మనుషులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిపోయిందని ప్రధాని మోడీ ఆరోపించారు. గతవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో బీజేపీ కార్యకర్త రతన్ దూబే ఎన్నికల ప్రచారం చేస్తుండగా నక్సలైట్లు హత్య చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News