Monday, December 23, 2024

డెన్మార్క్ చేరుకున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

కోపెన్‌హాగన్: ప్రధాని నరేంద్ర మోడీ తన మూడు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా మంగళవారం డెన్మార్క్ చేరుకున్నారు, ఈ సందర్భంగా ఆయన తన డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్‌సెన్‌తో చర్చలు జరుపుతారు. ఇంకా  2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో పాల్గొంటారు. జర్మనీ నుండి ఇక్కడికి చేరుకున్న మోడీ అక్కడ జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో వివరణాత్మక ద్వైపాక్షిక చర్చలు జరిపారు.  భారతదేశం-జర్మనీ అంతర్-ప్రభుత్వ సంప్రదింపులకు సహ-అధ్యక్షుడుగా ఉన్నారు.
డెన్మార్క్‌లో ప్రధానికి ఇది తొలి పర్యటన. భారత్ లో డెన్మార్క్ కు చెందిన 200 కంపెనీలు పనిచేస్తున్నాయి. కాగా డెన్మార్క్ లో 60 భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఐటి రంగంలో పనిచేస్తున్నాయి.  డెన్మార్క్ లో 16 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు.

ద్వైపాక్షిక విషయాల్లో పాల్గొనడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అందులో డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడెన్, నార్వే ప్రధానులు కూడా పాల్గొంటారు. 2018లో ఇండియా-నార్డిక్ సమ్మిట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిపుచ్చుకున్న సహకారం గురించి వారు చర్చించనున్నారు. ఈ సమ్మిట్‌లో ఆర్థిక ఎంగేంజ్‌మెంట్, గ్రీన్ పార్ట్‌నర్‌షిప్, మొబిలిటీ, ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News