Wednesday, January 22, 2025

జి7 శిఖరాగ్ర సమావేశాలు..జపాన్‌లో ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -
జపాన్ జి7 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ హిరోషిమా చేరుకున్నారు.

న్యూఢిల్లీ: గ్రూప్ ఆఫ్ సెవెన్(జి7) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్ వెళ్లారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని ఈ తూర్పు ఆసియా దేశాన్ని సందర్శిస్తున్నారు. శక్తివంతమైన సమూహం ప్రస్తుత అధ్యక్షుడిగా జపాన్ జి7 శిఖరాగ్ర సమావేశాలను నిర్వహిస్తోంది. మే 19 నుండి మే 21 వరకు జి7 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఇందుకుగాను మోడీ హిరోషిమాలో ఉన్నారు. ఆహారం, ఎరువులు, ఇంధన భద్రత సహా ప్రపంచ సవాళ్లపై ఆయన ప్రసంగించనున్నారు.

జి 7 సదస్సుకు హాజరయ్యే నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు. జి7లో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అవి: కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకె, యూఎస్, యూరోపియన్ యూనియన్(ఈయూ).

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News