Saturday, December 21, 2024

కాంగ్రెస్‌ది అంతా రివర్స్‌గేరే.. కపటదారే: మోడీ

- Advertisement -
- Advertisement -

ఛత్తర్‌పూర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్‌పై రివర్స్‌గేర్ వ్యాఖ్యలతో దాడికి దిగారు. దేశంలో జరిగే ప్రగతిని తిరోగమనంగా చూపడంలో కాంగ్రెస్ ఆరితేరిందని విమర్శించారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. దేశం వందేళ్లు వెనుకబడిందనే కాంగ్రెస్ వాదనను మోడీ తిప్పికొట్టారు. ఈ విధంగా అసత్యాలు వల్లించే కాంగ్రెస్ పార్టీ మరో వందేళ్లు అధికారం చేజార్చుకుంటుందని వ్యాఖ్యానించారు. కనీసం మరో వంద సంవత్సరాలు కాంగ్రెస్ గతితప్పిన దారి పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ వాహనం మనను రివర్స్‌గేర్‌లోకి తీసుకువెళ్లుతుంది. దేశం ముందుకు వేగంగా దూసుకుపోతూ ఉంటే వారి కళ్లకు బైర్లు కమ్ముకుంటున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో సుపరిపాలన బిజెపి ఆధ్వర్యంలో సాగుతూ ఉంటే కాంగ్రెస్ వారికి ఇది దుష్ట పాలనగా తోస్తోంది.

ఈ విధంగా దుష్ప్రచారానికి దిగడంలో ఆ పార్టీ అన్ని విధాలుగా ఆరితేరిందని , ఈ అతి తెలివితేటలే వారిని కొంపముంచేలా చేస్తాయని మండిపడ్డారు. తరాలుగా పలు విధాలుగా జలాశయాలు, నీటి వనరులు ఉన్న బందేల్‌ఖండ్ ప్రాంతాన్ని కాంగ్రెస్ సర్కారు వచ్చి తూట్లు పొడిచింది. చివరకు ఇక్కడి వారు నీటికోసం అలమటించే దుస్థితికి తీసుకువచ్చిందని ప్రధాని మోడీ బిజెపి తరఫున తమ ప్రచార అస్త్రాలను సంధించారు. కాంగ్రెస్‌కు దేశం అంటే కేవలం ఢిల్లీ అని, అక్కడనే పలు సమావేశాలు జరిపించిందని, అయితే ప్రతిష్టాత్మక సభలను కేవలం ఢిల్లీకే పరిమితం చేశారని విమర్శించారు. ఇందుకు బదులుగా బిజెపి ప్రభుత్వం జి 20 వంటి సదస్సులను చివరికి ఛత్తర్‌పూర్ వంటి ప్రాంతాలలో కూడా నిర్వహించిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News