జెడ్డా: సౌదీ అరేబియా యువరాజు మొ హమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోడీ తన రెండు రోజుల పర్యటన నిమిత్తం జెడ్డాకు మంగళవారం అరుదెంచారు. సౌదీ అరేబియాకు మోడీ వెళ్లడం ఇది మూడోసారి కాగా, చారిత్రక కోస్తా పట్టణమైన జెడ్డాకు వెళ్లడం ఇదే మొదటిసారి. జెడ్డాలో దిగగానే మోడీ కొన్ని ఫోటోలు ఎక్స్‌పోస్టులో విడుదల చేశారు. “ఈ సందర్శన భారత్, సౌదీ అ రేబియా దేశాల మధ్య స్నేహాన్ని మరీ బలోపేతం చేస్తుంది. ఈరోజు, రేపు వివిధ కార్యక్రమాల్లో పా ల్గొనడం ఆసక్తి కలిగిస్తుంది ” అని ఎక్స్‌పోస్టులో పేర్కొన్నారు. 2019 లో మోడీ సౌదీ అరేబియాలో పర్యటించినప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ సౌదీ అరేబియా యువరాజుతో ఉభయ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య సమావేశంలో పాల్గొనబోతున్నారు.
మో డీ ప్రయాణించిన విమానం సౌదీ అరేబియా గగనతలం లోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్15 విమానాలు దానిని అనుసరించి సగౌరవంగా స్వాగతించడం విశేషం. రెండు దేశాల మధ్య పటిష్టమైన రక్షణ సహకారా న్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ సందర్భంగా మోడీ సౌదీ యువరాజు తన సోదరునిగా ప్రశంసించారు. మోడీ ఈ పర్యటనలో ఉభయ దేశాల మ ధ్య కనీసం ఆరు ఒప్పందాలపై సంతకం చేయనున్నారు. హాజ్ యాత్రకు సంబంధించి భారత యా త్రికుల కోటాపైన కూడా మోడీ సౌదీ యువరాజుతో చర్చించనున్నారు. అంతరిక్ష పరిశోధన, ఇంధనం, ఆరోగ్యం, సైన్స్, సైన్సులో పరిశోధన, సాంస్కృతిక రంగం, అత్యంత ఆధునిక సాంకేతికత తదితర అంశాలపై ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.
మోడీకి స్వాగతంగా హిందీ చిత్ర గీతం ఆలపించిన సౌదీ గాయకుడు
సౌదీ గాయకుడు హషీం అబ్బాస్ మోడీకి స్వాగ తం పలుకుతూ అలియాభట్ వికీ కౌసల్ హిందీ చిత్రం లోని ‘అయె వతన్ మేరే ఆబాద్ రహే తు ’ అనే గీతాన్ని పాడి వినిపించారు. ఈ పాటకు మో డీ తన చప్పట్లతో లయ వేయగా జనం లోంచి పె ద్దగా స్పందన లభించింది.