Thursday, January 23, 2025

నేడు జి20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సును ప్రారంభించనున్న ప్రధాని

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జి 20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సదస్సును ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. భారత దేశం జి20 అధ్యక్ష స్థానంలో కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటు ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన జి20 సదస్సు థీమ్‌లాగానే ఈ సదస్సు థీమ్ కూడా ‘ పార్లమెంట్స్ ఫర్ ఒన్ ఎర్త్, ఒన్ ఫ్యామిలీ, ఒన్ ఫ్యూచర్’గా ఉంటుంది. ఈ సదస్సుకు జి20 సభ్య దేశాలతో పాటుగా ఆహానిత దేశాల పార్లమెంటు స్పీకర్లు హాజరవుతారు.

ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్ కూడా కూటమిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో తొలిసారిగా పాన్‌ఆఫ్రికన్ పార్లమెంటు కూడా ఈ సదస్సులో పాలు పంచుకొంటుంది. కాగా భారత్ కెనడాల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో కెనడా సెనేట్ స్పీకర్ రేమాండ్ గగ్నే ఈ సమావేశానికి రావడం లేదు. కాగా తాను ఈ సదస్సుకు వస్తున్నట్లు అంతకు ముందు ఆమె తెలిపారు కానీ ఇప్పుడు రావడం లేదని తెలిసింది. ఇదే విషయమై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను విలేఖరులు ప్రశ్నించగా జి20 ఈవెంట్లకు తాము అందర్నీ ఆహ్వానిస్తామని, అయితే పాల్గొనాలా లేదా అనేది వాళ్ల నిర్ణయమని ఆయన చెప్పారు. ఎందుకు రావడం లేదో వాళ్లనే అడిగితే బాగుంటుందని కూడా ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News