Thursday, January 23, 2025

ఇంటర్నేషనల్ సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

శ్రీ సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో రూ.15 కోట్లతో నిర్మించిన ఇంటర్నేషనల్ సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “పుట్టపర్తి పుణ్యక్షేత్రం దర్శించడం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. కోట్లమందికి సత్యసాయిబాబా ఆదర్శంగా నిలిచారు. సేవా మార్గాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

భారత్ ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోంది. పుట్టపర్తిలోనూ అన్ని కార్యకలాపాలు పూర్తిస్తాయిలో డిజిటల్ లోకి మారాలి. ప్రేమించండి.. ప్రేమను పంచండంటూ సత్యసాయిబాబా సందేశమిచ్చారు. జీవితాన్నే పేదలకు అంకితం చేసి తీరు ఆదర్శనీయం. ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయిబాబా. సేవాభావనే జీవన విధానంగా మార్చుకున్నారు. కురుణ, ప్రేమతో ఎంతోమందిని అక్కున చేర్చుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి జీవించాలి. సత్యసాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News