జలౌన్: ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆవిష్కరించారు. కాగా“అత్యాధునికమైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే 7 జిల్లాల గుండా వెళుతుంది. దాని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ ఎంతో ప్రయోజనం పొందుతుంది. ఈ ప్రాంతంలో గొప్ప పారిశ్రామిక అభివృద్ధి ఉంటుంది, ఇది స్థానిక యువతకు మరిన్ని అవకాశాలను తెస్తుంది” అని ప్రధాని శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రకూట్‌లోని భరత్‌కూప్‌లో మొదలై, ఇటావాలోని ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో కలిసిపోతుంది. ఇది చిత్రకూట్ నుండి ఢిల్లీకి ప్రయాణ సమయాన్ని 40% తగ్గిస్తుంది. 10 గంటలకు బదులు ఢిల్లీకి ఆరు గంటల్లోనే ఈ దారిగుండా చేరుకోవచ్చు.
‘‘బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపునిస్తుంది మరియు పారిశ్రామిక పెట్టుబడులకు మార్గంగా మారుతుంది” అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPEIDA) ఆధ్వర్యంలో 296 కిలోమీటర్ల పొడవైన నాలుగు-లేన్ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే సుమారు రూ. 14,850 కోట్ల రూపాయలతో నిర్మించబడింది. ఎక్స్‌ప్రెస్‌వేకి 2020 ఫిబ్రవరిలో ప్రధాని శంకుస్థాపన చేశారు. 28 నెలల్లో నిర్మాణం పూర్తయింది.
#PMModi inaugurates e-way of hope, says it is the highway of 'vikas' and vishwas.' Inaugurating the expressway, Modi said that #BundelkhandExpressway is a 'tribute to pride of #Bundelkhand.' pic.twitter.com/of9H4s0kAw
— TIMES NOW (@TimesNow) July 16, 2022