దేవ్‌ఘర్(ఝార్ఖండ్): ప్రజాకర్షక చర్యల ద్వారా షార్ట్‌కట్‌లో ఓట్లు సంపాదించడం సులభమే కానీ, ఈ తరహా రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఝార్ఖండ్ లోని దేవ్‌ఘర్‌లో సుమారు రూ.16,800 కోట్లతో చేపట్టిన నూతన విమానాశ్రయం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం షార్ట్‌కట్ రాజకీయాలు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయని, ఒక దేశంలోని రాజకీయాలు షార్ట్‌కట్‌పై ఆధారపడితే అది షార్ట్ సర్కూట్‌కు దారి తీస్తుందని హెచ్చరించారు. ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం చేరుకుంటున్న నేపథ్యంలో దేశాన్ని నూతన సమున్నత పథంలోకి తాము తీసుకువెళ్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఆలోచించకుండా ప్రజాకర్షక చర్యల ద్వారా షార్ట్‌కట్ విధానాలతో ఓట్లు సంపాదించడం చాలా సులువని ప్రధాని పేర్కొన్నారు. భక్తి, ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలకు భారత్ నిలయమని, తీర్ధయాత్రలు మనల్ని మంచి సమాజంగా, మంచి దేశంగా తీర్చి దిద్దుతాయని సూచించారు.
PM Modi inaugurates Deoghar Airport