Monday, January 6, 2025

కులం పేరిట కుట్రలు

- Advertisement -
- Advertisement -

కులం పేరిట సమాజంలో విషం వెదజల్లుతోందని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విరుచుకుపడ్డారు. గ్రామాల సంస్కృతిని, వారసత్వ సంపదను సుదృఢం చేసే లక్షంతో అటువంటి కుట్రలను భగ్నం చేయవలసిందిగా ప్రజలను ప్రధాని మోడీ కోరారు. ఢిల్లీలో గ్రామీణ్ భారత్ మహోత్సవ్‌ను ప్రధాని ప్రారంభిస్తూ, తన ప్రభుత్వం 2014 నుంచి గ్రామీణ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిందని, 2047 నాటికి వికసిత్ భారత్ కల సాఫల్యంలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ నేత, లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని, ఇతర ఇండియా కూటమి నేతలను మోడీ పరోక్షంగా ప్రస్తావిస్తూ, కొందరు వ్యక్తులు కులం పేరిట సమాజంలో విషం వెదజల్లుతున్నారని, సాంఘిక వ్యవస్థను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ‘అటువంటి కుట్రలను మనం భగ్నం చేసి, మన గ్రామాల ఉమ్మడి వారసత్వ సంపదను పరిరక్షించి, పటిష్ఠం చేయవలసి ఉంటుంది’ అని ఆయన నొక్కిచెప్పారు.

రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ సహా ప్రతిపక్ష నేతలు అదే పనిగా కుల గణనను కోరుతున్నారు. 2014 నుంచి తాను గ్రామీణ భారత సేవలో ఉన్నానని మోడీ తెలియజేశారు. ‘గ్రామీణ భారత ప్రజలకు గౌరవప్రద జీవితం లభించేలా చూడడం నా ప్రభుత్వ ప్రాథమ్యం’ అని ప్రధాని చెప్పారు. సాధికార గ్రామీణ భారతం, గ్రామస్థులకు పుష్కలంగా అవకాశాల కల్పన. వలసల తగ్గింపు, గ్రామాల ప్రజలకు జీవన సౌలభ్యం కల్పించడం ప్రభుత్వ లక్షం అని ఆయన తెలిపారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పథకాల గురించి మోడీ మాట్లాడుతూ, మరుగుదొడ్లను స్వచ్ఛ్ భారత మిషన్‌లో భాగం చేసినట్లు. పిఎం ఆవాస్ యోజనలో భాగంగా గ్రామీణ భారతంలో కోట్లాది మంది ప్రజలకు పక్కా ఇళ్లు సమకూర్చినట్లు తెలియజేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షిత, తాగు నీటిని సరఫరా చేసినట్లు ఆయన చెప్పారు.

‘ప్రస్తుతం ప్రలజకు1.5 లక్షలకుపైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లలో ఆరోగ్య సేవ సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు ఆర్థిక విధానాల సృష్టి ప్రాముఖ్యత గురించి ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు. ‘మా ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలు గ్రామీణ భారతానికి కొత్త శక్తితో సాధికారత కల్పిస్తున్నది’ అని ఆయన చెప్పారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధిద్వారా రైతులు ఆర్థిక సహాయంగా సుమారు రూ. 3 లక్షల కోట్లు అందుకున్నారని ఆయన తెలిపారు. గడచిన పది సంవత్సరాల్లో వ్యవసాయ రుణాల మొత్తాన్ని మూడున్నర రెట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు పశుసంవర్థక, చేపల రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేస్తున్నట్లు మోడీ చెప్పారు. ప్రభుత్వం గడచిన పది సంవత్సరాల్లో అనేక పంటలకు ఎంఎస్‌పిని పెంచుతూ వచ్చిందని కూడా ఆయన తెలియజేశారు. ‘ఉద్దేశాలు పవిత్రమైనవి అయినప్పుడు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయని కూడా ఆయన చెప్పారు.

ఇటీవల భారీ స్థాయిలో నిర్వహించిన ఒక సర్వే పలు ముఖ్య వాస్తవాలను వెల్లడించిందని ప్రధాని చెబుతూ, 2011లో పోలిస్తే గ్రామీణ భారతంలో వినియోగం సుమారు మూడింతలు అయిందని, ప్రజలు తమకు ఇష్టమైన వస్తువులపై మరింతగా వెచ్చిస్తున్నట్లు ఇది సూచిస్తోందని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి జనాభాలో అధిక సంఖ్యాకులు గ్రామాల్లో నివసిస్తుంటారని, వారిని పూర్వపు ప్రభుత్వాలు అలక్షంచేశాయని, ఇది గ్రామాల నుంచి వలసలకు, పేదరికం పెరుగుదలకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం విస్తరణకు దారి తీసిందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలను మోడీ పరోక్షంగా అవహేళన చేస్తూ, కొందరు వ్యక్తులు దశాబ్దాల తరబడి పేదరికం నిర్మూలన నినాదాలు చేస్తున్నారని, కానీ దేశంఇప్పుడు పేదరికంలో అసలైన తగ్గుదలను చూస్తున్నదని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన, పిఎం ముద్ర, పిఎంఎస్‌విఎ నిధి సహా 16 ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకులు సంతృప్తత కార్యక్రమం చేపట్టాయని తెలియజేశారు. ‘వికసిత్ భారత్ 2047’ కోసం ‘స్థితిస్థాపక గ్రామీణ భారత్ నిర్మాణం’ ధ్యేయంతో శనివారం నుంచి వచ్చే గురువారం (9) వరకు గ్రామీణ భారత్ మహోత్సవ్ 2025ను నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News