Monday, December 23, 2024

అహ్మదాబాద్‌లో ఐఎన్-సేస్ హెడ్‌క్వార్టర్స్

- Advertisement -
- Advertisement -

PM Modi inaugurates IN-SPACe headquarters

ప్రారంభించిన ప్రధాని మోడీ

అహ్మదాబాద్: అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడుతు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఐఎన్-సేస్)కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడిక్కడ ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ అంతరిక్ష రంగంలో సంస్కరణలను ప్రభుత్వం చేపట్టిందని, ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు తలుపులు తెరిచిందని చెప్పారు. ఐటి రంగం తరహాలోనే మన అంతరిక్ష రంగం కూడా ప్రపంచ అంతరిక్ష రంగంలో అగ్రగామిగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతరిక్ష రంగంలో సంస్కరణలు నిరాటంకంగా కొనసాగుతాయని ఆయన ప్రైవేట్ రంగానికి హామీ ఇచ్చారు. 21వ శతాబ్దంలో అంతరిక్ష టెక్నాలజీ ప్రపంచంలో భారీ విప్లవాన్ని తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News