Tuesday, December 24, 2024

అండర్ వాటర్ మెట్రోలో విద్యార్థులతో కలిసి ప్రయాణించిన మోడీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: దేశంలో మొదటిసారిగా నీటి అడుగున మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం అండర్ వాటర్ మెట్రో టన్నెల్ రైలులో విద్యార్థులతో మోడీ కలిసి ప్రయాణించారు. కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్ నుంచి హావడా మైదాన్ స్టేషన్ ప్రధాని ప్రయాణం చేశారు. అండర్ వాటర్ నిర్మాణ మార్గాన్ని 2017లో ప్రారంభించారు. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్ ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలో మీటర్లు ఉంటుందని, లైన్లలో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ టన్నెల్‌ను నిర్మించారు. ఈ దూరాన్ని 45 సెకన్లలో మెట్రో రైలు ప్రయాణించడంతో ప్రయాణీకుల ఆనంధానికి అవధులు లేకుండాపోయాయి. కోల్‌కతా ఈస్ట్ నుంచి వెస్ట్ మెట్రో కారిడార్ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. ప్రకృతి విపత్తులు తట్టుకునేలా దీని నిర్మాణాన్ని బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా గంటన్నర సమయం పడుతోంది. అండర్ వాటర్ మెట్రో మార్గంలో అయితే 40 నిమిషాలలో చేరుకుంటారు.

కోల్‌కతా నగరంలో 1984లో తొలిసారి మెట్రో రైలు ప్రారంభమైంది. తాజాగా అండర్ వాటర్ మెట్రో రైలు పరుగులతో కోల్‌కతా నగరం సరికొత్త రికార్డు సృష్టించింది. కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో మార్గం మొత్తం పొడవు 16.6 కిలో మీటర్లు కాగా 10.8 కిలో మీటర్లు భూగర్భంలోనే ఉంది. హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 520 మీటర్లు మాత్ర అండర్ వాటర్‌లో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News