Thursday, November 21, 2024

రూ. 284 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

బుధవారం గుజరాత్ నర్మద జిల్లాలో ఏక్తా నగర్‌లో ఐక్యత విగ్రహం వద్ద తన పర్యటన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ రూ. 284 కోట్లు విలువ చేసే వివిధ ప్రాజెక్టులకు, పర్యాటక ఆకరణలకు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపనలు చేశారు. రెండు రోజుల పర్యటనపై గుజరాత్ వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్రంలో తన బస సమయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవాల్లో పాల్గొంటారు. గురువారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా జరుపుతారు. మోడీ గుజరాత్‌లో పర్యటించడం ఈ వారంలో రెండవ సారి. అహ్మదాబాద్‌కు సుమారు 200 కిమీ దూరంలోని ఏక్తా నగర్‌కు బుధవారం సాయంత్రం వచ్చిన తరువాత ప్రధాని మోడీ ఉప జిల్లా ఆసుపత్రి,

స్మార్ట్ బస్ స్టాప్‌లు, ఒక 4 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, రెండు ఐసియుఆన్‌వీల్స్ సహా పలు కొత్త ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. ప్రధాని అదనంగా బస్ బే నుంచి వ్యూపాయింట్1 వరకు, ఏక్తా ద్వార్ నుంచి శ్రేష్ఠ భారత్ భవన్ (మొదటి దశ) వరకు నడకదారులను కూడా ప్రారంభించారు. ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఏక్తా నగర్‌లో రూ. 75 కోట్లతో ఏర్పాటు చేసే మురుగునీటి శుద్ధి ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. సుమారు 400 ఇళ్లు, ప్రభుత్వ క్వార్టర్లు, ఇతర ఆతిథ్య సంస్థలలో మురుగునీటి పారుదలకు ఈ ప్లాంట్ ఉపకరిస్తుంది. అగ్నిమాపక దళ సిబ్బంది నివాస క్వార్టర్లకు, సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు కూడా మోడీ శంకుస్థాపన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News