Monday, December 23, 2024

హిరోషిమాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

- Advertisement -
- Advertisement -

హిరోషిమా: హిరోషిమా పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం భయంతో వణికిపోతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జపానులోని హిరోషిమా నగరంలో శాంతికి చిహ్నంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధాని మోడీ శనివారం ఆవిష్కరించారు.
జి7 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోడీ శుక్రవారం జపాను చేరుకున్నారు. హిరోషిమాలో శనివారం ఆయన 42 అంటుళాల మహాత్మా గాంధీ బస్ట్ సైజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్ముని విగ్రహాన్ని హిరోషిమాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు, దాన్ని ఆవిష్కరించడానికి తనను ఆహ్వానించినందుకు జపాను ప్రభుత్వానికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.

1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అణుబాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో నగరం యావత్తు ధ్వంసం కాగా 1,40,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం నేడు వాతావరణ మార్పులు, ఉగ్రవాదం బెడదను ఎదుర్కొంటోందని, గాంధీ సిద్ధాంతాలతోనే ఈ బెడదలను ఎదుర్కోగలమని నరేంద్ర మోడీ తెలిపారు. గాంధీ సిద్దాంతాలను పాటించడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అని ఆయన చెప్పారు. మహాత్ముని అహింసా సిద్ధాంతం ఈ విగ్రహం ద్వారా ప్రపంచ ప్రజలకు వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు. తాము బహుమతిగా ఇచ్చిన బోధి మొక్కను జపాను ప్రధాని హిరోషిమాలో నాటినట్లు విని తాను చాలా సంతోషించానని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News