Monday, April 7, 2025

ప్రధాన మంత్రుల మ్యూజియంను ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi inaugurates Museum of Prime Ministers

తొలి ప్రవేశ టికెట్‌ను కొనుగోలు చేసిన వైనం

న్యూఢిల్లీ : దేశం లోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం “ప్రధాన మంత్రి సంగ్రహాలయ”ను గురువారం ప్రధాని మోడీ ప్రారంభించారు. దాన్ని సందర్శించేందుకు తొలి ప్రవేశ టికెట్‌ను ఆయన కొనుగోలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ లోని తీన్‌మూర్తి ఎస్టేట్‌లో ఈ మ్యూజియం ఉంది. అభివృద్ధి చెందుతోన్న భారత్‌ను ప్రతిబింబించేలా ఈ మ్యూజియంను రూపొందించారని అధికారులు తెలిపారు. 14 మంది ప్రధానుల గురించి వారి సేవల గురించి , వారు అనుసరించిన సిద్ధాంతాలు, ఇవన్నీ అవగాహన కల్పించేందుకు ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు. ఇదే సమయంలో స్వాతంత్య్ర పోరాట ఘట్లాను కూడా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన కోసం అధునాతన సాంకేతికతను వినియోగించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ మ్యూజియాన్ని మోడీ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News