Sunday, January 19, 2025

గుజరాత్‌లో వందేభారత్, మెట్రో రైలు 1

- Advertisement -
- Advertisement -

PM Modi inaugurates Vande Bharat Express

పచ్చజెండాతో ఆరంభించిన ప్రధాని మోడీ

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వేర్వేరు కార్యక్రమాలలో వందేభారత్ ట్రైన్‌ను, అహ్మదాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాల స్వరూపమే దేశ భవితను నిర్ధేశిస్తుందన్నారు. గాంధీనగర్ ముంబై వందేభారత్ సెమీ హైస్పీడ్ ట్రైన్‌కు పచ్చజెండా చూపి తొలి ప్రయాణాన్ని ఆరంభించిన ప్రధాని ఈ రైలులోనూ తరువాత ఆయన ఆరంభించిన మెట్రోరైలులోనూ ప్రయాణించారు. ఆ తరువాత జరిగిన సభలో ప్రసంగించారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్‌కు రెండురోజుల పర్యటనకు వచ్చిన మోడీ రెండో రోజున రైళ్లను ప్రారంభించారు. నగరాలు అన్ని విధాలుగా ఆధునిక వసతులను సంతరించుకోవాలని, ఇందులో త్వరితగతి, ట్రాఫిక్ రహిత ప్రయాణ సౌకర్యాలు కీలకం అన్నారు.

నగరాలు ప్రామాణికలతో వృద్ధి చెందాల్సి ఉంది. దీని వల్ల వచ్చే పాతికేళ్లలో దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందన్నారు. గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 10.30 గంటలకు వందేభారత్ రైలును ప్రారంభించారు. ఈ రైలు గుజరాత్, మహారాష్ట్ర రాజధానుల మధ్య అనుసంధాన రైలుగా ఉంటుంది. వందేభారత్ సీరిస్‌లో తొలి రైలు ఢిల్లీ వారణాసి మధ్య, తరువాత రెండోది న్యూఢిల్లీ శ్రీ మాతా వైష్ణోదేవీ కత్రా రూట్లో ఆరంభం అయింది. వందేభారత్ రైలులో ప్రధాని మోడీ కొందరు ప్రయాణికులతో ముచ్చటించారు. తరువాత అహ్మదాబాద్ సభలో ఆయన దేశ భవితను తీర్చిదిద్దే నగరాలు అహ్మదాబాద్, సూరత్, వడోదరా, భోపాల్, ఇండోర్ , జైపూర్ అని తెలిపారు. అహ్మదాబాద్‌ను మెట్రోరైలు ప్రాజెక్టులోకి తీసుకువచ్చే తొలి దశను ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. తొలి దశ రైలు తల్తేజ్, వస్త్రాల్ మధ్య నడుస్తుంది. ఈ మెట్రో రైలులో కొంత దూరం ప్రధాని మోడీ ప్రయాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News