Saturday, November 16, 2024

నౌకారంగంలో భారత్ విజయకేతనం:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

కొచ్చి : నౌకా రవాణా సామర్థంలో భారతదేశం ఇప్పుడు అగ్రగామి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నౌకల టర్న్ అరౌండ్ విషయంలో ( లోడింగ్, అన్‌లోడింగ్ , వ్రయాణాలు )లో భారతదేశం ఇప్పుడు పలు సంపన్న దేశాలను అధిగమించిందని, ప్రత్యేకించి నౌకల తయారీ సమయంలో ఇతరదేశాలను దాటివేశాని ప్రధాని తెలిపారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వద్ద పలు అత్యంత కీలకమైన పనులను, దాదాపు రూ 4000 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. నౌకల తయారీ కాలం తగ్గడం వల్ల క్రమేపీ అత్యధిక సంఖ్యలో నౌకల నిర్మాణానికి వీలేర్పడుతుంది. ఈ విధంగా దక్షిణ భారత ప్రాంతం అభివృద్ధి వేగవంతానికి దారితీస్తుందని తెలిపారు. ఇప్పుడు అందరి దృష్టి భారతదేశంపై నెలకొని ఉంది. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం సత్తాను, స్థానాన్ని అంతా గుర్తిస్తున్నారని వివరించారు. మిడిలిస్టు యూరప్ ఎకనామిక్ కారిడార్ సంబంధిత ఒప్పందాలు భారతదేశ జి 20 అధ్యక్ష దశలో కుదిరాయి.

ఈ ఒప్పందాలపై మన దేశం ఇప్పుడు దృష్టి సారిస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని తెలిపారు. మధ్యప్రాచ్యదేశాలతో , యూరప్‌తో పటిష్ట వాణిజ్య సంబంధాలకు ఏర్పాటు అయ్యే కారిడార్ మనకు అత్యంత కీలకమైనదని తెలిపారు. దేశ తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించడం ద్వారా వికసిత్ భారత్ సృష్టి వేగవంతం అవుతుంది. దీనికి ఇటువంటి వాణిజ్య మార్గాల ఏర్పాట్లు ప్రధానం అవుతాయని వివరించారు. భారతదేశం ఇటీవలి కాలంలో నౌకారంగంలో పలు విధాలుగా వృద్ధి చెందిందని, గతంలో అంటే ఓ దశాబ్ధం క్రితం వరకూ విదేశాల నుంచి వచ్చిన నౌకలు సరుకులతో ఎక్కువ రోజులు పోర్టులలో నిలిచి ఉండాల్సి వచ్చేది. అన్‌లోడింగ్‌కు ఎంతో సమయం పట్టేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, దీనితో దిగుమతి సరుకు సత్వరమే గమ్యాలకు చేరుతోందని వివరించారు. వికసిత్ భారత్ రూపకల్పన కేంద్రీకృత విషయం కాదు , ఇందులో ప్రతి రాష్ట్రం పాత్ర ఉంటుందని ప్రధాని తెలిపారు కొచ్చి దేశంలోనే అతి పెద్ద రేవుగా ఉంది.

షిప్‌నిర్మాణాలు, మరమ్మత్తులు, ఎల్‌పిజి సరుకు దింపే టర్మినల్ ఏర్పాటు వంటి వాటిలో కేరళకు ప్రాధాన్యత ఇస్తారని ప్రధాని తెలిపారు. కేరళ ,దేశ దక్షిణాది ప్రాంతం అంతా కూడా ఈ విధమైన అభివృద్ధి ఏర్పాట్లతో మరింతగా వృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడి షిప్‌యార్డ్‌లోనే మేడిన్ ఇండియా తయారీగా ఐఎన్‌ఎస్ విక్రాంత్ రూపొందిందని, ఇది ఈ రేవుకు గర్వకారణం అని తెలిపిన ప్రధాని ఇక్కడి సామర్థ పెంపుదలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఇతరులు హాజరయ్యారు. సిఎం విజయన్ ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కేరళకు చెందిన కెల్ట్రాన్ ఇతర కంపెనీలు వాటి ఉత్పత్తులతో ప్రఖ్యాతి గాంచాయని, చంద్రయాన్, ఆదిత్యా ఎల్ 1 వంటి విజయవంతమైన ప్రయోగాలలో పాత్ర వహించాయని గుర్తు చేశారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ టర్నోవర్ వచ్చే నాలుగేళ్లలో రూ 7000 కోట్లకు చేరనుందని అంచనాలు వెలువడుతున్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News