Monday, April 7, 2025

దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్‌ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

చెన్నై: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే లిఫ్ట్ బ్రిడ్జ్‌ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తమిళనాడులోని రామనాథపురంలో రూ.535 కోట్లతో దీనిని నిర్మించారు. పంబన్ బ్రిడ్జ్‌గా పిలిచే ఈ వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. సముద్రమట్టానికి 22 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన పొడవు 2.2 కిలోమీటర్లు. ఈ వంతెన కింద ఓడల రాకపోకలు జరిగే విధంగా వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. 2019 మార్చి 1న మోడీ ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేయగా.. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది.

భారీ పడవలు వెళ్లడానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న భాగం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. దీంతో పాటు రామేశ్వరం-తాంబారం మధ్య నడిచే ప్రత్యేక రైలును, అదే విధంగా వంతెన కిందగా వెళ్లే కోస్ట్ గార్డ్ నౌకను మోడీ ప్రారంభించారు. కొత్త రైలులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు సందడి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News