- Advertisement -
కశ్మీర్‌లో జెడ్ మోర్ టన్నెల్ అందుబాటులోకి వచ్చింది. సోనామార్గ్ టూరిస్ట్ రిసార్ట్‌కు ఏడాది పొడవునా అందుబాటులో ఉండేలా సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో 6.5 కి.మీ Z-మోర్ సొరంగంను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు.
శ్రీనగర్ లేహ్ మార్గంలో సోనామార్గ్ సమీపంలో ఈ టన్నెల్ ను నిర్మించారు. దీంతో ఇక ఏడాది పొడవునా శ్రీనగర్ నుంచి సోనామార్గ్‌కు కనెక్టివిటీ ఉండనుంది. దీంతో లేహ్ మార్గంలో కొండచరియలు విరిగిపడటం, హిమపాతం ప్రభావిత ప్రాంతాల నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణించొచ్చు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం ఒమర్ అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -