Monday, November 18, 2024

జిన్‌పింగ్ తో మోడీ మాటమంతి..

- Advertisement -
- Advertisement -

జొహెన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో చైనా అధినేత జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ముఖాముఖీ కలుసుకున్నారు. ఇరువురు నేతలు ఈ నేపథ్యంలో కొద్ది సేపు మాట్లాడుకున్నారు. లద్థాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి త్వరితగతిన సైన్యం ఉపసంహరణకు తగు విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అంగీకారానికి వచ్చారు. 2020 మే నెలలో ఇక్కడి గల్వాన్ లోయలో ఇరు దేశాల సైన్యం మధ్య ఘర్షణాత్మక ఘటనల నాటి నుంచి తీవ్రస్థాయి ఉద్రిక్తత నెలకొంది. వారిద్దరూ ఒకే వేదికపై ఉన్నప్పుడు ఎదురెదురయ్యారు. పక్కపక్కన కొద్ది సేపు మాట్లాడుకుంటూ కదిలారు.

బ్రిక్స్ విస్తరణ సంబంధిత ప్రకటన తరువాత ఈ ఇద్దరి మధ్య స్పల్పకాలిక భేటీ జరిగినట్లు వెల్లడైంది. భారత్ చైనాల మధ్య ఇప్పటికీ సరిహద్దు సమస్య రగులుతూనే ఉంది. ఘర్షణల తరువాత ప్రశాంతత ఏర్పడినా , పూర్తిస్థాయిలో సంయమనం ఏర్పడలేదు. అయితే ప్రతిష్టంభన లేని రీతిలో ఇరు పక్షాలు నడుమ సంప్రదింపులు జరుగుతున్నాయి. గ్లోబల్ సౌత్‌గా పేరొందిన ఈ బ్రిక్స్ కూటమి సదస్సు సందర్భంగా భారత్ చైనా నేతల నడుమ కీలక విషయాలపై పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని తొలుత విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ దశలో కొద్దిసేపే అయినా కీలక విషయంపై ఇరువురు నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News