Monday, December 23, 2024

జీసస్‌తో సర్వదా స్ఫూర్తి.. క్రిస్టియన్ సోదరులతో మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జీసస్ క్రీస్తు బోధనలు జనులందరికి మార్గదర్శకం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తన నివాసంలో ఆయన ఆదివారం క్రిస్టియన్ సోదరులతో ముచ్చటించారు. వారికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. తనకు అత్యంత ఆత్మీయ సాదర అనుబంధం క్రిస్టియన్లతో ఉండేదని వారితో పేర్కొన్నారు. ఈ ఆదరణీయ భావం ఎప్పుడూ ఉంటుందన్నారు. మానవాళి సేవలో , దయార్థ్రతలో జీసస్ జీవితం సర్వదా దివ్యకాంతిపుంజం అవుతుందన్నారు. అందరికి సమాన న్యాయం లక్షమైన సమ్మిశ్రిత సమాజం ఏర్పాటుకు క్రీస్తు పాటుపడ్డారని, ఆయన జీవితం, ముగింపు కూడా ఈ మార్గంలోనే సాగిందని కితాబు ఇచ్చారు. క్రిస్మస్ క్రీస్తు పుట్టిన రోజు వేడుక నిర్వహించుకునే సుదినం. అంతేకాకుండా ఆయన విలువలను సార్థకం చేసే దిశలో సాగేందుకు ప్రతిన వహించాల్సిన రోజు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News