Wednesday, December 25, 2024

భయం వద్దు.. రాజ్యాంగాన్ని మార్చబోం

- Advertisement -
- Advertisement -

వికసిత భారత్ పనులు రెండేళ్ల క్రితమే మొదలు అన్నీ చేయలేకపోవచ్చు.. చేయాల్సింది చాలా ఉంది కాంగ్రెస్ నమూనా..మా నమూనా తేడా చూసి ఓటెయ్యండి ఓటమి భయంతోనే ప్రతిపక్షాల ఆరోపణలు ఎందరు నాయకులను ఇడి జైలుకు పంపింది? ఎన్నికల బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధన ప్రవాహం జాతీయ వార్తాసంస్థకు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్వూ

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని మళ్లీ అధికారంలోకి తెస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందంటూ ప్రతిపక్షాలు ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెం దిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్షమని ఆయన ప్రకటించారు.

ఒక ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ లో ప్రధాని మోడీ వికసిత భారత్ సాధనకు తాను చేపట్టనున్న చర్యలను గురించి వివరించారు. నాకు భారీ ప్రణాళికలు ఉన్నాయని చెబితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరినీ భయపెట్టే నిర్ణయాలు తీసుకోను. దేశ సమగ్రాభివృద్ధికి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను. పైగా..మేమంగా చేసేశామని ప్రభుత్వాలు చెబుతుంటాయి. కాని..నేనంతా చేసేశానని నేను భావించను. సరైన దిశలో నేను అన్నీ చేయడానికి ప్రయత్నించాను..నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మ న దేశానికి అవసరాలు చాలా ఉన్నాయి. ప్రతి కుటుంబం కలలను ఎలా నెరవేర్చగలను..అందుకే ఇది ఒక ట్రెయిలర్ అని మాత్రమే అంటున్నానుఅని ప్రధాని తెలిపారు. విజన్ 2047 గురించి మాట్లాడుతూ..వికసిత భారత్ ప్రాజెక్టు పనులు గత రెండేళ్లుగా నడుతుస్తున్నాయని ఆయన వెల్లడించారు. తదుపరి పర్యాయం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి 100 రోజుల కోసం తానే లక్ష్యాలను నిర్దేశించుకున్నానని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరానని, రానున్న 25 సంవత్సరాలలో తాము ఎటువంటి భారత్‌ను చూడాలనుకుంటున్నామో 15 లక్షల మందికి పైగా తనకు సూచనలు అందచేశారని, యూనివర్సిటీలు, ఎన్‌డిఓలు, 15-20 లక్షల మందిని నుంచి అభిప్రాయలు తీసుకున్నానని ఆయన చెప్పారు. 2047లో మనం 100 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటామని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని మైలురాయిని చేరుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు విఫల కాంగ్రెస్ నమూనాకు, తన పనితీరును చూపి న బిజెపి నమూనాకు మధ్య తేడాను గుర్తించి ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఓటరుకు కల్పిస్తున్నాయని మోడీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు 5, 6 దశాబ్దాలు పనిచేశాయని, తాను కేవలం 10 ఏళ్లు మాత్రమే పనిచేశానని ఆయన చెప్పారు. ఏ రంగంలో పోలికలు చూసినా కొన్ని లోపాలు ఉండడం సహజమేనని, అయితే మన ప్రయత్నంలో లోపాలు ఉండరాదని ఆయన చెప్పారు.

ఓటమి భయంతోనే ఆరోపణలు
లోక్‌సభ ఎన్నికలలో తమకు సమాన అవకాశాలు దక్కడం లే దని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోడీ తోసిపుచ్చారు. ఇవి ఓటమి భయంతో చేస్తున్న ఆరోపణలని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థలకు సంబంధించిన చట్టాలు తాను అధికారంలోకి రాకముందు నుంచి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రభుత్వం దుర్వినియో గం చేస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు.

కేవలం 3 శాతం కేసులు మాత్రమే రాజకీయ నాయకులపై ఉన్నాయని, గతంతో పోలిస్తే గత పదేళ్లలో అత్యధిక మొత్తంలో నగదును ఇడి జప్తు చేసుకుందని ఆయన తెలిపారు. ఇడి, సిబిఐ, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన చట్టాలేవీ తన ప్రభుత్వం చేయలేదని ఆయన చెప్పారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే త్రిసభ్య కమిటీలో ప్రతిపక్ష నాయకుడికి కూడా చోటు కల్పిస్తూ తన ప్రభుత్వం బిల్లు ఆమోదించిందని మోడీ గుర్తు చేశారు. నేడు ఎన్నికల కమిషన్ ఏర్పడితే అందులో ప్రతిపక్షం కూడా ఉంటుందని ఆయన అన్నారు. గతంలో ప్రధాన మంత్రి ఫైలుపై సంత కం పెట్టి ఎన్నికల కమిషన్‌ను నియమించేవారని, ప్రధాని కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎన్నికల కమిషనర్లు అయ్యేవారని మ్రోడీ ఆరోపించారు. పదవి అయిపోయిన తర్వాత రాజ్యసభ టికెట్లు, మంత్రి పదవులలో వారిని నియమించేవారని ఆయన అన్నారు. ఎన్నికలలో ఓడిపోతామన్న భయంతోనే ప్రతిపక్షాలు సాకులు వెతుకుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఆడలేనమ్మ మద్దెలు ఓడు అన్నట్లు ప్ర తిపక్షాలు ఇవిఎంలను సాకుగా చూపుతున్నాయంటూ మోపు చురకలు అంటించారు. ప్రతిపక్ష నాయకులను జైళ్లకు పంపుతున్నారంటూ వారు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ ఎంత మంది ప్రతిపక్ష నాయకులు జైలుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. ఈ ప్రతిపక్ష నాయకులే ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అంటూ ఆయన నిలదీశారు. వారిని పాపభయం వెంటాడుతోందని, నిజాయితీపరులకు భయం ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా(గుజరాత్) ఉ న్నపుడు తన హోం మంత్రి(అమిత్ షా)ని జైలులో పెట్టారని ఆయన గుర్తు చేశారు. 2014కు ఇడి రూ. 5,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని, కాని తన ప్రభుత్వం గత 10 ఏళ్లలో రూ. 1 లక్ష కోట్ల ఆస్తులను జప్తు చేసిందని మోడీ వెల్లడించారు. ఇడి నమోదు చేసిన అన్ని కేసులలో కేవలం 3 శాతం మాత్రమే రాజకీయ నాయకులకు చెందినవని, మిగిలిన వారెవరికీ రాజకీయాలతో సంబంధం లేదని ఆయన చెప్పారు.

బాండ్ల రద్దుతో మళ్లీ నల్ల ధన ప్రవాహం
ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై ప్రధాని మోడీ స్పందిస్తూ నిజాయితీగా ఆలోచించిన పక్షంలో ప్రతి ఒక్కరూ ఇందుకు పశ్చాత్తాపం చెందుతారని వ్యాఖ్యానించారు. నల్ల ధనం వాడకాన్ని ఎదుర్కొనేందుకే తన ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. బాండ్ల గురించి ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి వేల కోట్ల రూపాయల నిధులు సమకూరాయన్న విమర్శను ఆయన తిప్పికొట్టారు. మనీ లాండరింగ్ కేసులు ఎదుర్కొన్న తర్వాత 16 కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని మోడీ చెప్పారు. అయితే వాటిలో 63 శాతం విరాళాలు బిజెపియేతర పార్టీలకే వెళ్లాయని ఆయన వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ముస్లిం లీగ్ నకలుగా గతంలో అభివర్ణించిన ప్రధాని మోడీ ఆ మేనిఫెస్టో వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. దేశానికి చెందిన మొదటిసారి ఓటరు ఆశలను నాశనం చేస్తుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News