Monday, January 20, 2025

స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం

- Advertisement -
- Advertisement -

భౠరీ స్టాక్ మార్కెట్ కుంభకోణంతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నేరుగా ప్రమేయం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. ఈ కుంభకోణంలో రిటేల్ ఇన్వెస్టర్లు రూ. 30 లక్షల కోట్లు నష్టపోయారని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)తో దర్యాప్తు జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు ముందు స్టాక్ మార్కెట్లపై మోడీ, అమిత్ షాతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వ్యాఖ్యలు చేశారని విలేకరుల సమావేశంలో రాహుల్ ఆరోపించారు. బూటకపు ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఉవ్వెత్తునఎగసిన స్టాక్ మార్కెట్లు జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత పతనమై పోయాయని, దీని వల్ల రిటేల్ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో నష్టపోయారని ఆయన చెప్పారు. జూన్ 4న స్టాక్ మార్కెట్‌లో సామాన్య ప్రజలు రూ. 30 లక్షల కోట్లు నష్టపోయారని ఆయన తెలిపారు. దేశంలో జరిగిన అత్యంత భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణంపై జెపిసి దర్యాప్తు కోసం తాము డిమాండు చేస్తున్నామని రాహుల్ తెలిపారు.

బిజెపిలోని అగ్ర నాయకులు ఈ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని, ఇందులో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతోపాటు ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహించిన వారిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే 5 కోట్ల కుటుంబాలకు నిర్దిష్టమైన పెట్టుబడి సలహాను ఎందుకు ఇవ్వవలసి వచ్చిందని ప్రధాని మోడీ, అమిత్ షాను రాహుల్ ప్రశ్నించారు. ప్రజలకు పెట్టుబడి సలహాలు ఇవ్వడం వారి పనా అని ఆయన నిలదీశారు. స్టాక్ మార్కెట్లను మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కంటూ సెబీ దర్యాప్తును ఎదుర్కొంటున్న ఒక వ్యాపార గ్రూపునకు చెందిన మీడియా సంస్థకు ఇద్దరూ ఎందుకు ఇంటర్వూలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఒక బడా వ్యాపార సంస్థకు చెందిన ఒకే చానల్‌కు ప్రధాని, హోం మంత్రి ఇంటర్వూలు ఇచ్చారని ఆయన తెలిపారు. బిజెపికి, బూటకపు ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులు, మోసపూరిత ఇన్వెస్టర్లకు మధ్య సంబంధాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News