Wednesday, January 22, 2025

ప్రధాని మోడీ భయపడుతున్నాడు

- Advertisement -
- Advertisement -
ఆప్ దక్షిణ భారత ఇంఛార్జ్ సోమనాథ్ భారతి

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి ప్రధాని మోడీ భయపడుతున్నాడని ఢిల్లీ శాసన సభ్యులు, ఆప్ దక్షిణ భారత ఇంఛార్జ్ సోమనాథ్ భారతి తెలిపారు. కేవలం పది సంవత్సరాలలో ఆప్ జాతీయ పార్టీగా ఎదిగి, మోదీకి కేజ్రీవాల్ ప్రధాన పోటీదారుగా మారడాన్ని బిజెపి జీర్ణించుకోలేకపోతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్టీసి కల్యాణ మండపంలో ఆదివారం ‘సామాన్యుడి సమరభేరి’ రాష్ట్ర స్థాయి సదస్సును ఆప్ తెలంగాణ శాఖా నిర్వహించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలనుండి జిల్లా కన్వీనర్లు, అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జీలు, మండల, గ్రామా కన్వీనర్లు, ఆప్ వాలంటీర్లు దాదాపు రెండు వేల మంది ప్రతినిధులుగా పాల్గొన్న ఈ సదస్సుకు ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు శోభన్ భూక్యా అధ్యక్షత వహించారు.

సోమనాథ్ భారతి ముఖ్యఅతిథిగా పాల్గొని ‘సామాన్యుడి సమరభేరి’ సదస్సు ప్రారంభించి ప్రసంగించారు. ప్రధాని మోడీ దేశాన్నే అమ్ముకుంటూ తన కార్పొరేట్ మిత్రులైన అదానీ, అంబానీలకోసం పని చేస్తున్నాడని ఆరోపించారు. బిజెపి హిందూ వ్యతరేక కార్పోరేట్‌ల పార్టీ అని, ఓట్ల కోసం మతం పేరుతో దేశ ప్రజలను విభజించడం, విద్వేషాలను సృష్టించడం, వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందన్నారు. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పాలనా నమూనాలో భాగమైన మెరుగైన పాఠశాలలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, ఉచిత విద్యుత్ యూనిట్లు, మెరుగైన రోడ్లు, మహిళలకు సాధికారత, రైతులకు సబ్సిడీలు వంటి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్శిస్తున్నాయని, ‘వన్ నేషన్, వన్ ఎడ్యుకేషన్, వన్ హెల్త్ కేర్’ వంటి ఆప్ ఎజెండాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు.

ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ ఆప్ పాలిత రాష్ట్రాల్లో అందిస్తున్న ఉచిత విద్యుత్, విద్య, వైద్య సౌకర్యాలు అధికారంలోకి వస్తే తెలంగాణ లో కూడా అమలు చేస్తామన్నారు. ‘మార్పు’  పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, బూత్ స్థాయి నుండి ఆప్ ను బలోపితం చేస్తున్నామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేసేందుకు తెలంగాణ ఆప్ సిద్ధంగా ఉందని అయన తెలిపారు. ఈ సదస్సులో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, ఎం ఏ. మజీద్, డా. సోలొమన్ రాజ్, డా. హరి చరణ్, డా. అన్సారీ, డా. పుట్ట పాండురంగయ్య, బాబుల్ రెడ్డి, తిరుమల రావు, ఆప్ మహిళా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హేమ జిల్లోజు, యమునా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

AAP Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News