Monday, January 20, 2025

సిఎం కెసిఆర్ పథకాలు కాపీ కొట్టడానికే తెలంగాణకు ప్రధాని రాక

- Advertisement -
- Advertisement -
తెలంగాణ అభివృద్ధికి మోడీ చేసిందేమీ లేదు
ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం

హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాపీ కొట్టేందుకే తెలంగాణకు మోడీ వస్తున్నారని ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం ధ్వజమెత్తారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై అనిల్ కూర్మాచలం మండిపడ్డారు. తొమ్మిది సంవత్సరాలుగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని పర్యటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 9 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ చేసిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అటు విభజన హామీలు, ఇటు రాష్ట్రానికి రావాల్సిన వనరులన్నింటిలో తెలంగాణకు అన్యాయం చేశారని, ఈ దేశంలో తెలంగాణ లేదు అనే విధంగా వివక్షతో వ్యవహారిస్తున్నారని అనిల్ కూర్మాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు బిజెపికి డిపాజిట్ గల్లంతు చేసి తగిన బుద్ధి చెబుతారని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News