Saturday, December 21, 2024

మోడీలు ఎవరు ఒబిసిలు కాదు: రేణుకా చౌదరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని కాంగ్రెస్ నేత ఎంపి రేణుకా చౌదరి విమర్శించారు. రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడారు. తనపై మోడీ చేసిన వ్యాఖ్యలపై లీగల్‌గా వెళ్లే యోచనలో ఉన్నామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ వెల్లడిస్తామన్నారు. అదానీ అంశంపై ప్రశ్నించినందుకే రాహుల్‌ను టార్గెట్ చేశారని మండిపడ్డారు. కేసులు పెట్టినంత మాత్రాన భయపడేదే లేదన్నారు. మోడీలెవరు ఒబిసిలు కాదని, ఒబిసిలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. డ్రెస్సులు మార్చుకునే వారికి దేశభక్తి గురించి ఎలా? తెలుస్తుందని ప్రశ్నించారు. గతంలో పార్లమెంటులో ఎంపి రేణుకా చౌదరిని శూర్పణఖ అని పిఎం మోడీ వ్యంగంగా పిలిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News